
హోం వర్క్ చేయలేదని విద్యార్థులపై చెప్పులతో దాడి
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు హోం వర్క్ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు అనిత మానవత్వాన్ని మరిచి వారిని చెప్పుతో కొట్టింది. పిల్లలపై శారీరక దాడికి దిగిన ఉపాధ్యాయురాలి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని నిలదీశారు. ఆమె చేసిన దుశ్చర్యపై శబ్దం పెంచి గొడవకు దిగారు. అనితను…