A meeting was held in Jaitavaram village to form child protection committees and discuss prevention of child marriages and crimes against women.

జైతవరం గ్రామంలో బాలల కమిటీ సమావేశం

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలం, జైతవరం గ్రామ సచివాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ఒక ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కమిటీల ప్రధాన ఉద్దేశ్యం బాల్య వివాహాలను నివారించడమే కాక, మహిళలపై జరిగే దాడులను, వేధింపులను అరికట్టడంలో కీలక పాత్ర పోషించడమేనని ఆమె…

Read More
A raid was conducted in Mediwada village of Anakapalli district, seizing 20 liters of illicit liquor and destroying 1500 liters of sugarcane mash used for its production.

మేడివాడ గ్రామంలో నాటు సారా పై పోలీసులు దాడి

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలంలోని మేడివాడ గ్రామ శివార్లలో నాటు సారా తయారీపై అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఎన్.సుర్జిత్ సింగ్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ వి.సుధీర్ గారి ఆదేశాల మేరకు దాడులు జరిగాయి. ఈ దాడిలో 20 లీటర్ల నాటు సారాను సీజ్ చేసి, నాటు సారా తయారీకి ఉపయోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడికి సంబందించి మేడివాడ గ్రామానికి చెందిన గేడి చిన్నాలు మరియు…

Read More
MGNREGA workers in Devarapalli stage protests demanding release of pending wages; anger erupts against central and state governments.

ఉపాధి బకాయిలపై కూలీల ఆందోళన, డిమాండ్లు

దేవరాపల్లి మండలంలోని వాకపల్లి పంచాయతీలో గురువారం ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 13 వారాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారు చేతులెత్తి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌ను దండం పెడుతూ తమ గళం వినిపించారు. జిల్లావ్యాప్తంగా రూ.55 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు “చెల్లింపులు లేకపోతే ఎలా బ్రతకాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పనిచేసిన పనులకు సరైన రుసుము లేక, రోజువారీ అవసరాలు తీరడం…

Read More
Accused Mahesh arrested for stabbing a youth to death in Narsipatnam’s Ayyannacolony. Old dispute during festival led to the brutal incident.

నర్సీపట్నంలో యువకుడి హత్య, నిందితుడు అరెస్టు

పండుగలో గొడవ, దుర్మార్గమైన హత్యనర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్నకాలనీలో ఈ నెల 8న తలుపులమ్మ తల్లి పండుగ సందర్భంగా స్టేజీ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో రుత్తల దుర్గాప్రసాద్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా నిందితుడు చిత్రాడ మహేష్ తో చిన్నపాటి గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో ఆ గొడవ తాత్కాలికంగా ముగిసినప్పటికీ, మహేష్ మాత్రం దురభిప్రాయంతో హత్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. చాకుతో దాడి, మృతి చెందిన దుర్గాప్రసాద్ఘటన జరిగిన రాత్రి ఒంటి గంట సమయంలో…

Read More
In Chodavaram, convict gets death sentence in child murder case; advocates and police officer felicitated for justice effort

చోడవరం చిన్నారి హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు

అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని న్యాయస్థానం చరిత్రలో ఒక చారిత్రాత్మక తీర్పుగా బుధవారం రాత్రి వెలువడింది. దేవరపల్లి ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధించారు. ఈ కేసులో అత్యుత్తమంగా తమ సేవలందించిన అడ్వకేట్ ఉగ్గిన వెంకట రావు మరియు ASI అప్పల నాయుడుకు ఫోరం ఫర్ బెటర్ చోడవరం సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఫోరం వ్యవస్థాపకులు ఆర్క్ ప్రసాద్, బద్రి మహంతి వెంకట రావు…

Read More
A youth named Pavan was murdered near Garnikam on Sunday night. Police are investigating the motive behind the killing.

రావికమతం వద్ద యువకుడి హత్య, విచారణలో పోలీసులు

విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. మేడివాడకు చెందిన 22ఏళ్ల కొలిపాక పవన్ కుమార్ అఘాయిత్యానికి గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి నుంచి క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు….

Read More
A farmer set fire to his sugarcane crop due to delayed payments and low prices, suffering a loss of 20 tons and ₹60,000.

గిట్టుబాటు ధర రాక రైతు ఆవేదన – చెరుకు తోటకు నిప్పు

ఆరుగాలం కష్టపడి చెరుకు పండించినా గిట్టుబాటు ధర రాక, సకాలంలో చెల్లింపులు అందక రైతు తీవ్ర మనోవేదన చెందాడు. రొంగలి వెంకటరావు అనే రైతు తన 20 టన్నుల చెరుకు తోటకు నిరాశతో నిప్పంటించాడు. ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తుంటానని, అయితే ఫ్యాక్టరీ పేమెంట్లు ఆలస్యం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. చెరుకు పండించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాన్ని మిగిలిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట…

Read More