
విశాఖలో బాలయ్య పాటలతో సంగీత విభావరి సందడి!
విశాఖపట్నంలో బాలకృష్ణ హిట్ పాటలతో నిర్వహించిన నిర్విరామ సంగీత విభావరి అభిమానులను ఉర్రూతలూగించింది. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 100 హిట్ పాటలు, 200 మంది గాయకుల గళామృతం సంగీత ప్రియులకు మధురానుభూతిని అందించింది. బాలకృష్ణ సినిమాల సూపర్ హిట్ పాటలకు అభిమానులు కేరింతలు కొట్టారు. “జై బాలయ్య జై జై బాలయ్య”, “సమరసింహా రెడ్డి” వంటి పాటలకు ప్రేక్షకులు స్టేజ్…