
కూలీ రేట్లు పెంచక పోవడం నేతన్నల పోరుకు దారి
బీఆర్‌ఎస్ హయాంలో చీరెల ఆర్డర్లతో ఉత్సాహంగా సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుదేలైపోయింది. బతుకమ్మ చీరెల ఆర్డర్లు నిలిపివేయడంతో వేలాది నేతన్నలు ఉపాధి కోల్పోయారు. దాంతో 30 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కార్మికులు ప్రభుత్వాన్ని వేడించినా, స్పందన లేక పోవడంతో చివరికి పోరుబాట పట్టారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు చీరెల ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధి తిరిగి దక్కింది కానీ, కూలీ రేట్లు మాత్రం నిర్ణయించలేదు. ప్రభుత్వం…