
భీమిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ – టీడీపీలో కీలక చేరిక
భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు శ్రీకాంత్ రాజు టీడీపీలో చేరారు. బుధవారం శొంట్యాంలో జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంటా శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి…