
వేములవాడలో మహాశివరాత్రి జాతర ఘనంగా ఏర్పాట్లు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగే ఈ జాతరకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ రూ. 1.75 కోట్లతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు ప్రాచుర్యం పొందింది. అందుకోసం…