
మరో ముగ్గురు చిన్నారులకు మహేశ్ బాబు ఆదరణ
సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న హీరో మహేశ్ బాబు, తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ మహేష్ తన దాతృత్వాన్ని నిరూపించుకుంటున్నారు. తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ మరోసారి మానవతా భావంతో ముందుకొచ్చింది. వరలక్ష్మి (2 నెలలు), పూజ్యశ్రీ ఫనీక్ష (8 నెలలు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెలలు) అనే ముగ్గురు చిన్నారులకు విజయవంతంగా హార్ట్ సర్జరీలు నిర్వహించారు….