
నిర్లక్ష్యానికి ఆక్రోశం – విద్యార్థులపై విషపూరిత దాడి
కుటుంబ నిర్లక్ష్యానికి పాఠశాలపై అసహజ ప్రతీకారం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో ఓ యువకుడు పాఠశాల విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన దారుణం కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో 27ఏళ్ల సోయం కిస్టు అనే నిరుద్యోగ యువకుడు విద్యార్థులకు విషభోజనం పెట్టేందుకు ప్రయత్నించాడు. ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాత్రలపై పురుగుల మందు – అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది పాఠశాల ప్రిన్సిపాల్…