
మాదిగ అమరవీరులకు వెంకటగిరిలో క్యాండిల్ లైట్ నివాళి
ఉమ్మడి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కాంపాలెం 25వ వార్డ్ మాదిగవాడలో మాదిగ అమరవీరులకు క్యాండిల్ లైట్ నివాళులు అర్పించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకత్వం నిర్వహించింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన మాదిగ బిడ్డలకు జోహార్ అంటూ నాయకులు నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడునెల్ల కాలంగా నిరంతరం పోరాటం సాగిస్తున్నామని, పాలకుల మోసపూరిత విధానాలను…