గణతంత్ర దినోత్సవాన మావోయిస్టుల దుశ్చర్య.. 11 మంది జవాన్లకు గాయాలు
Karregutta Forest Blast: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన అధికారి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన కర్రెగుట్టల అడవులు గతంలో మావోయిస్టుల బలమైన స్థావరాలుగా…
