
మల్లారెడ్డి – పార్టీ మారే వార్తలపై సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీతో, మల్లారెడ్డి తన అల్లుడితో కలిసి పార్టీ మారిపోతున్నాడని కొన్ని ఊహాగానాలు నడిచాయి. అయితే ఈ ప్రచారంపై మల్లారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో పార్టీ మారడంపై గాసిప్ అస్తమానం చేయడం తగదని,…