
కోవూరు రైతుల ఆగ్రహం – ధాన్యం కొనుగోలుపై నిరసన
కోవూరు మండలం పాటూరులో వ్యవసాయ శాఖ జేడీ సీ. సత్యవాణి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయగా, రైతులు తమ సమస్యలను ఉద్ధేశించి తీవ్రంగా మాట్లాడారు. తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొలవడం లేదని, ఇప్పటికీ కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మీశెట్టి శీనయ్య మాట్లాడుతూ, మూడునెలల క్రితమే ఎమ్మెల్యేకు ఈ సమస్య గురించి చెప్పినప్పటికీ, ఇప్పటికీ ఎటువంటి చర్యలు…