కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్లో ట్రైని డీఎస్పి శివ ప్రియ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి అనుమతులేని వాహనాలను పరిశీలించారు. రూల్స్ పాటించని వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధించారు.
అనుమతుల్లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నవారికి చలాన్లు విధించారు. రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రహదారి ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడతారని, వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రత ప్రమాణాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ ధరిస్తే మంచిదని సూచించారు.