హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం చూపించింది. హయత్‌నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ఖైరతాబాద్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మోకాలి లోతు వరకూ చేరిన వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. పంజాగుట్ట నిమ్స్ వద్ద కారుపై చెట్టు విరిగిపడటం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు నిలిచిపోవడం, యూసఫ్‌గూడ, మలక్‌పేట, జవహర్‌నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ఉధృతి ఉద్రిక్తత కలిగించింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వద్ద గంటల తరబడి వాహనాలు కదలకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలెక్కడైనా ఇబ్బంది పడకూడదని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
