Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadహైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్

-

Chat on WhatsApp

హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం చూపించింది. హయత్‌నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ఖైరతాబాద్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

మోకాలి లోతు వరకూ చేరిన వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. పంజాగుట్ట నిమ్స్ వద్ద కారుపై చెట్టు విరిగిపడటం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు నిలిచిపోవడం, యూసఫ్‌గూడ, మలక్‌పేట, జవహర్‌నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ఉధృతి ఉద్రిక్తత కలిగించింది.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వద్ద గంటల తరబడి వాహనాలు కదలకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలెక్కడైనా ఇబ్బంది పడకూడదని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp