Uttar pradesh youtube operation: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన. యూట్యూబ్ వీడియో చూసి ఒక మహిళకు శస్త్రచికిత్స చేసిన నాన్-లైసెన్స్ క్లినిక్ ఆపరేటర్ ఆమెను చంపేశాడు. బారాబంకీ జిల్లా కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ క్లినిక్‌లో ఈ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం ఎలాంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, తన మేనల్లుడు వివేక్ కుమార్‌తో కలిసి యూట్యూబ్ ట్యుటోరియల్ చూసి మహిళకు ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ మునిశ్రా రావత్ మరణించింది.
ALSO READ:ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్ కోహ్లీ.. నెంబర్ వన్‌గా రోహిత్ శర్మ
భర్త తెహబహదూర్ రావత్ ఫిర్యాదు మేరకు పోలీసులు క్లినిక్‌ను సీజ్ చేసి, నిందితులిద్దరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ ఘటన, యూట్యూబ్ లేదా ఏఐ టూల్స్ ఆధారంగా స్వయం వైద్యం చేయడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది.
