ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం..ఆరుగురు మహిళల దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రైలుప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను హౌరా–కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఆరుగురు మహిళలు దుర్మరణం చెందారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి యాత్రికులు చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం, యాత్రికులు చోపాన్–ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో చునార్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ప్లాట్‌ఫాం వైపు కాకుండా రైలు పట్టాలపై దిగారు. ఎదురుగా ఉన్న…
