రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే తన ప్రతిపాదన శాంతిని నెలకొల్పేందుకు మార్గమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎప్పటికైనా పీస్ ప్లాన్‌ను అంగీకరించాల్సిందేనని ఆయన అన్నారు.
ఇదికూడా చదవండి :Tejas Fighter Jet Crash | వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృ*తి
ఈ యుద్ధం పూర్తిగా సిగ్గుచేటు పరిస్థితికి దారితీసిందని, తాను అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి యుద్ధం ప్రారంభమే అయ్యేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఒక్క నెలలోనే రెండు దేశాలు కలిపి సుమారు 25 వేల మంది సైనికులను కోల్పోయారని చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి ప్రాణ నష్టం జరిగిన సందర్భం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి ఏర్పాటు కోసం తన ప్రణాళికే సరైన దారి అని ఆయన స్పష్టం చేశారు.
