అనకాపల్లి జిల్లా చోడవరం కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందడం లేదని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు.
60 గ్రామాల ప్రజలకు సేవలందించే ఈ ఆసుపత్రిలో ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వేతనాలు తీసుకుంటున్న వైద్యులు, ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ పేదలను పీడిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిని ధర్మాసుపత్రిగా పిలుస్తున్న ప్రజలకు అక్కడ వైద్య సేవలు అందించడం లేదని అన్నారు.
చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ ఎల్. వినయ్ కుమార్ ‘నక్షత్ర’ పేరుతో ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నారని, అక్కడ రోగులకు నక్షత్రాలు చూపుతున్నారని వెల్లడించారు.
అలాగే, ఫిజియోథెరపీ వైద్యులు కూడా కొత్తూరు లో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.
అత్యవసర సమయంలో గర్భిణీలు, బాలింతలు, ప్రమాద సమయంలో రోజూ వందలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు.
అయితే, ప్రైవేట్ వ్యాపారాలకు వైద్యులు ఆసుపత్రిని వ్యాపార ప్రకటనగా ఉపయోగిస్తున్నారని అప్పలరాజు ఆరోపించారు.
వైద్య ఉన్నతాధికారులు పేదలకు వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు, లేకపోతే పోరాటాలు చేస్తామని తెలిపారు.