Tejas Jet Crash:దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన ఈ తేలికపాటి యుద్ధ విమానం (LCA Tejas) మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రదర్శన ప్రయాణం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.
ALSO READ:Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు
విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగి, దట్టమైన పొగ అక్కడి ప్రాంతాన్ని కమ్మేసింది. అత్యవసర సేవలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే నుండి విమానం నడిపిన పైలట్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన కోసం రెస్క్యూ బృందాలు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ ఘటనపై స్థానిక అధికారులు, ఎయిర్ షో నిర్వాహకులు, భారత ప్రతినిధులు సంయుక్త విచారణ ప్రారంభించినట్లు సమాచారం. స్వదేశీ రక్షణ సామర్థ్యాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన తేజస్ విమానం ఇలాంటి అంతర్జాతీయ ప్రదర్శనలో కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
