Gangotri temple announces ban on entry of non-Hindus

ఉత్తరాఖండ్‌లో సంచలన నిర్ణయం.. గంగోత్రి ధామ్‌లో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం

Gangotri Temple Decision: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల(Uttarakhand Temples) సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలను కాపాడే దిశగా ఆలయ కమిటీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ‘దేవభూమి’గా ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించే చర్యలు ప్రారంభమయ్యాయి. గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిబంధనలు గంగోత్రి ధామ్‌తో పాటు శీతాకాలంలో గంగామాత కొలువై ఉండే ముఖ్బా ప్రాంతానికీ వర్తిస్తాయని కమిటీ…

Read More
RBI Recruitment 2026 for 572 office attendant posts

RBI Recruitment 2026 | ఆర్బీఐలో భారీ నోటిఫికేషన్.. 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు

RBI Recruitment 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం మొత్తం 572 ఖాళీలను ప్రకటించింది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (Matriculation) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం…

Read More
China nuclear data leak investigation involving top military general

China Military Crisis | చైనా అణు ప్రోగ్రామ్ డేటా లీక్‌పై దర్యాప్తు ప్రారంభం

China Military Crisis: చైనాలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఒకరు తీవ్రమైన ఆరోపణలతో దర్యాప్తు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవినీతితో పాటు కీలకమైన అణ్వాయుధాల రహస్యాలను విదేశీ దేశానికి లీక్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం చైనా మిలిటరీలో సంచలనంగా మారింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జనరల్ జాంగ్ యూక్సియా ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి…

Read More
Pawan Kalyan Ustaad Bhagat Singh first still released

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ స్టిల్ విడుదల…పవర్ స్టార్ హ్యాండ్ రైజ్ స్టిల్ వైరల్

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” టాలీవుడ్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు మంచి స్పందన లభించగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ స్టిల్ సోషల్ మీడియాలో…

Read More
Padma Awards 2026 sports winners list

ఈ ఏడాది పద్మ అవార్డుల్లో మెరిసిన క్రీడాకారులు ఎవరో తెలుసా?

Padma Awards 2026 Sports List: భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలైన పద్మ అవార్డులను 2026(Padma Awards 2026) సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, క్రీడలు, సాహిత్యం, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ వంటి విభాగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించడం ఆనవాయితీ. 2026 ఏడాదికి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో…

Read More
Telugu States Republic Day celebrations in Hyderabad and Amaravati

Republic Day 2026: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day 2026: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక వైభవంతో రిపబ్లిక్ డే (Republic Day) కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన…

Read More
Telangana police personnel honored with central medals on Republic Day 2026

Telangana Police Medals 2026: గణతంత్ర దినోత్సవానికి 23 మందికి పురస్కారాలు

గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పురస్కారాల్లో తెలంగాణ పోలీస్(Telangana Police Medals) శాఖ విశేషంగా నిలిచింది. రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది సిబ్బందిని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలకు గాను కేంద్ర పతకాలకు ఎంపిక చేశారు. విధి నిర్వాహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పతకాన్ని సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డి అందుకున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి చూపిన సాహసానికి ఈ…

Read More