Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeEducation NewsRBI Recruitment 2026 | ఆర్బీఐలో భారీ నోటిఫికేషన్.. 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు

RBI Recruitment 2026 | ఆర్బీఐలో భారీ నోటిఫికేషన్.. 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు

-

Chat on WhatsApp

RBI Recruitment 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం మొత్తం 572 ఖాళీలను ప్రకటించింది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (Matriculation) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు తమకు సంబంధించిన రాష్ట్రం లేదా ప్రాంత భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు SC/ST/PwBD/మాజీ సైనికులకు రూ.50 + GST కాగా, జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.450 + GSTగా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో తార్కిక శక్తి, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, సంఖ్యా సామర్థ్య విభాగాలు ఉంటాయి. అనంతరం భాషా ప్రావీణ్యత పరీక్ష ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,250/- ప్రారంభ మూల వేతనం లభిస్తుంది. అన్ని భత్యాలతో కలిపి ప్రారంభ స్థూల వేతనం సుమారు రూ.46,029/- ఉంటుంది. అర్హత కలిగిన వారు ఫిబ్రవరి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌బిఐ ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 మధ్య జరగనున్నాయి.

also read:China Military Crisis | చైనా అణు ప్రోగ్రామ్ డేటా లీక్‌పై దర్యాప్తు ప్రారంభం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp