Mahatma Gandhi Statue Stolen | గాంధీ విగ్రహని ఎత్తుకెళ్లిన దొంగలు..ఎక్కడంటే

Mahatma Gandhi bronze statue theft in Australia Mahatma Gandhi bronze statue theft in Australia

Mahatma Gandhi Statue: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసి ఎత్తుకెళ్ళడం కలకలం రేపింది. జనవరి 12 అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ‘యాంగిల్ గ్రైండర్’తో విగ్రహం పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానిక మరియు భారతీయ సమాజంలో కలకలం రేపుతోంది.

ఈ విగ్రహం భారత ప్రభుత్వం (ICCR) తరపున ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చినది. 2021లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ ఘనంగా ఆవిష్కరించారు. గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు విగ్రహం ధ్వంసం చేసేందుకు జరిగాయి. ఇప్పుడు నిందితులు విగ్రహాన్ని ముక్కలుగా చేసి స్క్రాప్ వ్యాపారులకు అమ్మే అవకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రవాస భారతీయులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పోలీసులు ఎవరైనా అనుమానాస్పదంగా భారీ కాంస్య ముక్కలను అమ్మడానికి వస్తే వెంటనే సమాచారం అందించాలని హెచ్చరించారు.

ALSO READ:Indian Rupee | భారత్‌కు గుడ్ న్యూస్…వాణిజ్య ఒప్పందంతో రూపాయికి భారీ లాభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *