Indian Rupee | భారత్‌కు గుడ్ న్యూస్…వాణిజ్య ఒప్పందంతో రూపాయికి భారీ లాభం

Indian Rupee strengthens against US Dollar Indian Rupee strengthens against US Dollar

Indian Rupee: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ బలం వంటి కారణాలతో కొంతకాలంగా ఒత్తిడిలో ఉన్న భారత రూపాయి, తాజాగా అనుకూల పరిణామాలతో మళ్లీ బలపడింది. మంగళవారం ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 119 పైసలు పెరిగి 90.30 స్థాయికి చేరింది. గత సోమవారం ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే ఇది భారీ పెరుగుదలగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

India US Trade Deal

ఈ లాభానికి ప్రధాన కారణం అమెరికా భారత(IND-US Export) ఎగుమతులపై విధిస్తున్న సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు అనుకూల వాతావరణం ఏర్పడిందని ఫారెక్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ పరిణామం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను (FIIs) మళ్లీ భారత మార్కెట్ల వైపు ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తున్నారు.

అదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా జోరుగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 2,138 పాయింట్లు (2.62 శాతం), నిఫ్టీ 607 పాయింట్లు (2.42 శాతం) లాభపడటంతో భారత రూపాయికి అదనపు మద్దతు లభించింది.

సుంకాల తగ్గుదలతో పాటు రూపాయి బలపడటం వల్ల దిగుమతి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని, ఫలితంగా ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

also read:Pawan Kalyan warns liquor shop owners | లిక్కర్ షాప్ యజమానులకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *