Saturday, August 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadMLA Defection Case | తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

MLA Defection Case | తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

-

Chat on WhatsApp

MLA Defection Case: ఎమ్మెల్యేలు ఫిరాయింపు కేసులో మరో కీలక మలుపు వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ బుధవారం, ఈ నెల 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని వివేకానందకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, వివేకానంద వాదనలను స్పీకర్ స్వయంగా విననున్నారు.

ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల్లో ఇప్పటివరకు పది పిటిషన్లు స్పీకర్ ముందు దాఖలయ్యాయి. వీటిలో ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని పేర్కొంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉండగా, తాజాగా కడియం శ్రీహరి కేసు విచారణకు రానుంది.

మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కడియం శ్రీహరి విచారణ అనంతరం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

also read:Telangana mountaineer | దేశ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Tamil Nadu CM Vijay and wife Sangeetha after divorce petition withdrawal in family court.

Sangeetha | సీఎం విజయ్ కుటుంబంలో కీలక మలుపు.. విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత,...

Sangeetha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చకు దారితీసిన సీఎం విజయ్(CM Vijay) కుటుంబ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా...
- Advertisement -
Chat on WhatsApp