భారత్–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు వర్షం కారణంగా రద్దయింది. నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో భారత్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది. తీవ్ర వర్షం, మెరుపుల కారణంగా ఆటను మళ్లీ ప్రారంభించడం సాధ్యంకాలేదు.

దీంతో సిరీస్ భారత్ ఖాతాలో పడింది. భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు. ఇద్దరూ కలసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ALSO READ:కరీంనగర్‌లో కలకలం స్కూటీ నుంచి బయటపడ్డ పాము పిల్ల
ఇదే సిరీస్‌లో మునుపు కాన్‌బెర్రాలోని మూడో టీ20 కూడా వర్షం కారణంగా రద్దయింది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచినా, హోబర్ట్ (5 వికెట్లు) మరియు గోల్డ్ కోస్ట్ (48 పరుగులు)లో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
