Wednesday, April 15, 2026
Chat on WhatsApp
HomeFilms NewsJr NTR Double Treat for Fans | ఎన్టీఆర్ బర్త్‌డేకు డబుల్ ధమాకా రెడీ

Jr NTR Double Treat for Fans | ఎన్టీఆర్ బర్త్‌డేకు డబుల్ ధమాకా రెడీ

-

Chat on WhatsApp

Jr NTR Double Treat: ‘వార్ 2’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ “జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)” ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా “డ్రాగన్” సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జోరుగా కొనసాగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మే 19న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో తారక్ లుక్‌పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ చిత్రం 2026 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రాజెక్ట్ “గాడ్ ఆఫ్ వార్” కూడా హాట్ టాపిక్‌గా మారింది. మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్”దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మే 19నే వచ్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ సూపర్ హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మైథలాజికల్ టచ్‌తో కూడిన సోషియో ఫాంటసీగా ఈ సినిమా రూపొందనుందని టాక్. అంతేకాదు, “దేవర 2″అప్‌డేట్స్ కూడా అదే సమయంలో రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఈసారి ఎన్టీఆర్ బర్త్‌డే అభిమానులకు పండుగలా మారనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

AP police detain comedian Anudeep Katikala over controversial comments on Pawan Kalyan

Anudeep Katikala | పోలీసుల అదుపులో స్టాండప్ కమెడియన్

Anudeep Katikala: హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల అరెస్ట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు.అనుదీప్ తన...
- Advertisement -
Chat on WhatsApp