HYDRA Action in Kondapur: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో హైడ్రా (HYDRA) అధికారులు సంచలన ఆపరేషన్ నిర్వహించి సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడకు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న జంగమోనికుంట పరిసరాల్లో ఈ చర్యలు చేపట్టారు.
స్థానికంగా ఉన్న జంగమోనికుంటకు చెందిన సుమారు 4 ఎకరాల భూమిని కొంతమంది కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించారు. కుంటలో మట్టిని పోసి, భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ అక్రమాలకు సంబంధించి స్థానికులు రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు చేశారు.
ఫిర్యాదులు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేసి, హైడ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన హైడ్రా బృందం సంఘటనా స్థలానికి చేరుకుని కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్రమ కబ్జాలను అడ్డుకుని ప్రభుత్వ ఆస్తిని రక్షించిన హైడ్రా చర్యపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
HYDRA Action in Kondapur | కొండాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్
HYDRA officials fencing encroached government land worth ₹700 crore near Jangamonikunta in Kondapur, Hyderabad.
