Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadTG ICET 2026 Notification | ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల ప్రారంభం

TG ICET 2026 Notification | ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల ప్రారంభం

-

Chat on WhatsApp

TG ICET 2026: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే “TG ICET 2026” నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది టీజీ ఐసెట్ నిర్వహణ బాధ్యతను నల్లగొండలోని “మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU)”కి అప్పగించారు. శుక్రవారం ఎంజీయూ వీసీ చాంబర్‌లో వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

అభ్యర్థులు ఈ నెల “ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు” ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ “icet.tgche.ac.in” లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750గా, రిజర్వ్‌డ్ క్యాటగిరీ అభ్యర్థులకు రూ.550గా నిర్ణయించారు.

ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. పరీక్షలు “మే 13, 14 తేదీల్లో” నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు మే 4 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రాథమిక కీ మే 29న విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం “జూన్ 19న ఫైనల్ కీతో పాటు ఫలితాలు” ప్రకటించనున్నారు.

also read:US–Iran Tension | అటు చర్చలు.. ఇటు ఆంక్షలు – ట్రంప్ డబుల్ గేమ్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp