Home Films News Big Buzz on Rowdy Janardhana | ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ గెస్ట్ రోల్?

Big Buzz on Rowdy Janardhana | ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ గెస్ట్ రోల్?

0
Big Buzz on Rowdy Janardhana | ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ గెస్ట్ రోల్?
Vijay Deverakonda Rowdy Janardhana movie

Rowdy Janardhana: టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. స్టార్ నిర్మాత “దిల్‌రాజు” భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు “రవి కిరణ్ కోలా” దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

ఈ సినిమాలో సీనియర్ నటుడు “రాజశేఖర్” ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ పూర్తయిందని, ఇప్పటివరకు చూడని విధంగా రాజశేఖర్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. ఆయన పాత్ర కథలో కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని సమాచారం.

ఇక విజయ్ దేవరకొండ సరసన “‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్” హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. విజయ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త మేకోవర్‌తో కనిపించనున్నారని, ఆయన పాత్ర గ్రామీణ రాజకీయాలు, యాక్షన్ అంశాలతో నిండిపోయి ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై హాట్ టాపిక్‌గా మారిన మరో అంశం ఏమిటంటే…ఇందులో ఒక “ప్రత్యేక గెస్ట్ రోల్” ఉందట. ఆ పాత్ర కోసం చిత్ర బృందం ఒక “బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ను సంప్రదించబోతున్నట్లు” ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్యారెక్టర్ కథను కీలకంగా మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.

ఈ రూమర్స్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ గెస్ట్ రోల్ ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే మేకర్స్ నుంచి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.