BJP MP Raghunandan Rao addressing media on Delhi blast propaganda

ఢిల్లీ పేలుళ్లపై మా పార్టీపై దుష్ప్రచారం చేయడం దేశద్రోహం: రఘునందన్ రావు

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై మా పార్టీ (BJP)పై దుష్ప్రచారం జరుగుతుందంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశద్రోహం కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. Sardar Vallabhbhai Patel 150th jayanthi సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన “సర్దార్-ఏక్తా పాదయాత్ర”లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడంతా చేతిలో ఫోన్ ఉందని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని అబద్ధపు…

Read More
Sangareddy Unity March held on Sardar Vallabhbhai Patel’s 150th birth anniversary

Sardar Vallabhbhai Patel 150th jayanthi:సర్దార్ పటేల్ స్ఫూర్తితో దేశ ఏకత కోసం ఐక్యత మార్చ్

దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి(Sardar vallabhai patel 150th jayanthi) సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యత మార్చ్‌ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని “మై భారత్”(My Bharat) సంస్థ సమన్వయంతో ఐబి నుండి కలెక్టరేట్‌ వరకు ఈ పాదయాత్ర సాగింది. ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్యతో పాటు అధికారులు,…

Read More
అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం

ప్రభుత్వ భూమి కాపాడేందుకు వెళ్లిన అమీన్‌పూర్‌ తహసీల్దార్‌పై దాడి

పటాన్‌ చెరు అర్బన్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ వెంకటేశ్‌పై దారుణ దాడి జరిగింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే — అమీన్‌పూర్‌ మండల పరిధిలోని 630 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, ఆ భూమిపై షెడ్డు నిర్మించారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్‌ వెంకటేశ్‌ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి, ఆ షెడ్డు తొలగించాలని ఆదేశించారు. కానీ, తహసీల్దార్‌…

Read More
చీమల భయంతో వివాహిత ఆత్మహత్య

చీమల భయంతో వివాహిత ఆత్మ*హత్య – రామచంద్రాపురం అమీన్‌పూర్‌లో విషాదం

రామచంద్రాపురం అమీన్‌పూర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీమల భయంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య కాలనీలో నివసిస్తున్న మనీషా (25) చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. 2022లో మనీషా, చిందం శ్రీకాంత్ (35)ను వివాహం చేసుకుంది. వీరికి మూడు సంవత్సరాల పాప అనికా ఉంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు ఉద్యోగ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా అమీన్‌పూర్‌లో నివసిస్తున్నారు. ALSO…

Read More
కర్ణాటకలో కారు,వ్యాను ఢీకొని తెలంగాణ వాసులు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – నలుగురు తెలంగాణ వాసుల మృతి

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప‌ (45), కాశీనాథ్‌ (60), నాగరాజు‌ (40)గా పోలీసులు గుర్తించారు.సమాచారం ప్రకారం, వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలో…

Read More

సంగారెడ్డి హైవే దోపిడీ దుండగుల వీరంగం: లారీ డ్రైవర్ హత్య

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలో జాతీయ రహదారిపై దోపిడీ దుండగులు అర్ధరాత్రి సమయంలో డ్రైవర్లపై వెంపొందారు. ఈ దుండగుల ముఠా సేకరించిన డబ్బుల కోసం లారీ డ్రైవర్ అసిఫ్‌పై దాడి చేసి, అతడు ప్రతిఘటించడంతో కత్తులతో తీవ్రంగా గాయపరిచి హత్య చేసారు. సోమవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసిఫ్ ప్రాణాలు విడిచాడు. అసిఫ్ దాడికి ముందు అదే ముఠా మరికొన్ని లారీ డ్రైవర్లపై దాడులు జరిపింది. రుద్రారం వద్ద నిలిచిన నూర్ షేక్‌కు సహాయం…

Read More

సంగారెడ్డిలో నల్లకుంట చెరువు ఎర్రగా మారింది – కలుషిత జలాలపై రైతుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా నల్లకుంట చెరువులో చోటుచేసుకున్న అసాధారణ ఘటన స్థానిక ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, చెరువంతా ఎర్రటి రంగులోకి మారిన నీరు వరి పొలాల్లోకి చేరి పంటలను ముంచెత్తిందని రైతులు ఆరోపించారు. ఈ వీడియోతో ప్రాంతీయంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ సమస్యపై చర్చ మొదలైంది. చెరువులోని నీరు ఎందుకు అకస్మాత్తుగా రంగు మారిందో తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డ స్వయంగా సంగారెడ్డి జిల్లా…

Read More