హైదరాబాద్‌లో శిశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 11 మంది సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు చిన్నారులను రక్షించారు. రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పిల్లలను అమ్మే ముఠా మగబిడ్డలను నాలుగు నుంచి…
