అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 11 మంది సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు చిన్నారులను రక్షించారు. రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి 5 వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పిల్లలను అమ్మే ముఠా మగబిడ్డలను నాలుగు నుంచి ఐదు లక్షల వరకు, ఆడబిడ్డలను రెండు నుండి మూడు లక్షల వరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
జనవరి, ఫిబ్రవరిలో ముగ్గురు చిన్నారులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గర్భిణీ మహిళలను టార్గెట్ చేసి వారి పిల్లలను అక్రమంగా అమ్మేందుకు ఒప్పించేది.
నిందితులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణాపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.