శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం ఆలస్యమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మూడు గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యానికి సరైన సమాచారం అందించలేదని విమానయాన సంస్థపై మండిపడ్డారు.
విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణం ఆలస్యమైందని స్పైస్‌జెట్ సిబ్బంది వెల్లడించారు. అయితే, ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం తమను తీవ్ర అసహనానికి గురిచేసిందని ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ఇవాళ్టితో ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. అలాంటి సమయంలో విమానయాన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే 60 కోట్లకు పైగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. చివరి రోజున ఈ ఆలస్యం భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు విమర్శలు గుప్పించారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.