‘హరిహర వీరమల్లు’ డబ్బింగ్ ప్రారంభం – మే 9న గ్రాండ్ రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా చివరి దశకు చేరుకుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో తెరకెక్కిన ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. తాజాగా మేకర్స్ డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. “అసమాన హీరోయిజంను తెరపై చూడటానికి ఇక కొన్నిరోజుల సమయమే ఉంది”…
