మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకొని జగన్‌ను అభినందించారు.
జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, బొమ్మిడి ఇజ్రాయిల్, భరత్, రమేష్ యాదవ్ ఉన్నారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా జగన్‌కు అభివాదం చేశారు.
మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు తదితరులు జగన్‌కు అభినందనలు తెలియజేశారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గన్నవరం చేరుకుని విజయోత్సాహంతో నినాదాలు చేశారు.
గన్నవరం విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్ బయలుదేరి వెళ్లారు. రోడ్ మార్గమంతా కార్యకర్తలు, వైసీపీ అభిమానులు ఆయనను ఆహ్వానిస్తూ దర్శనమిచ్చారు. జగన్ రాకపై పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.