పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా చివరి దశకు చేరుకుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో తెరకెక్కిన ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం మే 9న విడుదల కాబోతోంది.
తాజాగా మేకర్స్ డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. “అసమాన హీరోయిజంను తెరపై చూడటానికి ఇక కొన్నిరోజుల సమయమే ఉంది” అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఆర్జున్ రాంపాల్, నోరా ఫతేహీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీ జ్ఞానశేఖర్ హ్యాండిల్ చేశారు.
భారీ వాస్తవిక సెట్స్‌లో తెరకెక్కిన ఈ సినిమా మఘల్ సామ్రాజ్యంలోని వీరుడి కథను ఆధారంగా చేసుకుని రూపొందింది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపేలా ఉన్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘హరిహర వీరమల్లు’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.