వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన. మృతుల సంఖ్య 402
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 402కి పెరిగింది. గాలింపు చర్యల్లో ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గల్లంతైన మరో 170 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా చలియార్ నదిలో మృతదేహాలు, శరీర అవయవాలు…
