భారత్ సరిహద్దుల్లో ఉగ్రవాద విస్తరణకు పాక్ కొత్త కుట్రలు
భారత్ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కొత్త కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్ మద్దతుతో ఉగ్ర సంస్థలు భారత్ సరిహద్దు దేశాలైన “నేపాల్, బంగ్లాదేశ్” ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్-నేపాల్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఈ శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, “ఆపరేషన్ సిందూర్” తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లా, నేపాల్ సరిహద్దు సమీప రాష్ట్రాల్లో…
