క్రికెటర్‌ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం

ప్రపంచకప్‌ విజేత క్రికెటర్‌ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం

విజయవాడలో క్రికెటర్‌ శ్రీచరణి అడుగుపెట్టగానే ఘన స్వాగతం లభించింది. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), శాప్‌ అధికారులు, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆమెకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయానికి శ్రీచరణి కీలక పాత్ర పోషించిందని…

Read More
శ్రీకాళహస్తి సమీపంలోని పాత రాయల్ చెరువుకు గండి కారణంగా గ్రామాల్లో నీటి ప్రవాహం

పాత రాయల్‌ చెరువుకు గండి – గ్రామాల్లో నీటి ప్రవాహం, రైతుల్లో ఆందోళన

సత్యవేడు నియోజకవర్గంలోని కె.వి.బి.పురం మండలంలో ఉన్న పాత రాయల్‌ చెరువుకు భారీగా గండి పడింది. చెరువు గట్టు తెగిపోవడంతో గ్రామాల మధ్యలో నీరు ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో ఒత్తిడి పెరగడం, దానివల్ల గండి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.చెరువు నీరు పాతపాలెం, కలెత్తూరు, అరుంధతి వాడ గ్రామాల్లోకి చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీటిమునిగిన పొలాలు, ఇళ్ల వద్ద వరద ముప్పు కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవాహ ఉద్ధృతి కాలంగి…

Read More
అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు శ్రీదేవి

అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు – హృదయాన్ని కదిలించిన సంఘటన

చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి జీవితంలో విషాదాలు వరసగా వచ్చాయి. భర్తను కోల్పోయిన కొద్దికాలానికే ఆమె కుమారుడు కూడా మరణించడంతో కుటుంబ భారమంతా ఆమెపై, ఆమె కోడలు శ్రీదేవిపై పడ్డది. వికలాంగురాలైన అత్త ఆదిలక్ష్మిని అండగా నిలబెట్టి, శ్రీదేవి తన పిల్లల సంరక్షణతో పాటు కుటుంబాన్ని ధైర్యంగా నెట్టుకొచ్చింది.మగతోడు లేకుండా కుటుంబాన్ని నడిపిన శ్రీదేవి, నవంబర్ 2న అత్త ఆదిలక్ష్మి ఆకస్మిక మరణంతో తీవ్రంగా కుంగిపోయింది. అయినప్పటికీ తాను తల్లిలా భావించిన అత్తకు తలకొరివి పెట్టి…

Read More
హోంమంత్రి వంగలపూడి అనిత ఈగల్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు

ఏడాదిన్నరలోనే  జీరో  గంజాయి రాష్ట్రంగా చేసాం:హోంమంత్రి వంగలపూడి అనిత

మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ మరియు గంజాయి నిర్మూలనలో ఈగల్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈగల్‌ వ్యవస్థను ప్రారంభించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయి రాష్ట్రంగా చేసాం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని, డ్రగ్స్‌ ప్రభావంతో నష్టపోయిన యువతను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. గతంలో గంజాయికి బానిసైన యువతను చూసి తల్లిదండ్రులు…

Read More
విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

 విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మరియు పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు.మండవ జానకిరామయ్య సుమారు 27 సంవత్సరాల పాటు విజయ డెయిరీ ఛైర్మన్‌గా పనిచేశారు. తన పదవీకాలంలో పాడి రైతుల ఆదాయాన్ని పెంచడం, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక సంస్కరణలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో…

Read More
బాపట్లలో బైక్‌ లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి

బాపట్లలో రోడ్డు ప్రమాదం – బైక్‌ లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి

బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడియార స్తంభం కూడలిలో వేగంగా దూసుకొచ్చిన బైక్‌ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడ గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) బీహార్ సూర్యలంక బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీచ్‌ మూసివేయడంతో గుంటూరుకు బయలుదేరిన వారు చీరాల నుంచి వస్తున్న లారీ వెనుకకు బైక్‌తో ఢీకొట్టారు. ఢీకొట్టిన వేగం కారణంగా ఇద్దరూ…

Read More
Odisha RTC bus catches fire near Parvathipuram, passengers escape safely

పార్వతీపురం వద్ద ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆందోళన చెలరేగింది. ఉదయం 7.45 గంటల సమయంలో ఆంధ్రా–ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను దిగిపోవాలని సూచించారు. కొద్ది సేపట్లో మంటలు చెలరేగినా, అందరూ…

Read More