Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప్రపంచకప్‌ విజేత క్రికెటర్‌ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం

ప్రపంచకప్‌ విజేత క్రికెటర్‌ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం

-

Chat on WhatsApp

విజయవాడలో క్రికెటర్‌ శ్రీచరణి అడుగుపెట్టగానే ఘన స్వాగతం లభించింది. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), శాప్‌ అధికారులు, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆమెకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.

ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయానికి శ్రీచరణి కీలక పాత్ర పోషించిందని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

ALSO READ:Womens World Cup విజేతలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ

శ్రీచరణి స్వస్థలానికి చేరుకున్న సందర్భంగా అభిమానులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. మహిళా క్రికెట్‌లో మరింత ఎత్తులకు చేరాలని అందరూ ఆకాంక్షించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india indonesia defence deal with brahmos and astra missiles agreement

India and Indonesia | బ్రహ్మోస్‌ నుంచి అస్త్ర వరకు.. భారత్‌తో కీలక రక్షణ...

India and Indonesia: భారత్‌ రక్షణ రంగ సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) సమయంలో తన సత్తాను చాటిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిపై ఇండోనేసియా...
- Advertisement -
Chat on WhatsApp