నర్సీపట్నంలో వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పెద్ద బొడ్డేపల్లి వైయస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ వైయస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను నవరత్నాల పథకాల ద్వారా తగ్గించారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో కీలక మార్పులు తీసుకువచ్చాయని, నవరత్నాల…
