రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12:.40 గంటలకు శంషాబాద్ నుంచి కొచ్చి బయలుదేరాల్సిన ఇండిగో విమానం ఇప్పటికీ రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విమాన ఆలస్యంపై ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అయ్యప్ప స్వాములు ఆరోపించారు. గంటల తరబడి వేచి చూసినా, ప్రయాణికులకు నీరు, భోజనం, విశ్రాంతి వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేవని వారు తెలిపారు.

ALSO READ:Akhanda 2: అఖండ 2 రిలీజ్ 2026కి వాయిదా? | బుక్ మై షో 2026 డేట్ గందరగోళం
అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎయిర్లైన్స్ నుంచి టికెట్ అమౌంట్ రిఫండ్ కూడా అందలేదు అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు స్వాములు, కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు.
