Telangana railway budget | తెలంగాణకు రైల్వే కేంద్ర బడ్జెట్‌లో తక్కువ శాతం

Telangana receives only 2.2% increase in railway budget Telangana receives only 2.2% increase in railway budget

Telangana railway budget: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రైల్వే నిధులు ఈసారి కేవలం 2.2 శాతమే పెరిగాయి. 2025-26(Indian Railways 2025-26)లో రూ.5,337 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.5,454 కోట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా రైల్వే నిధులు సుమారు 10% పెరగగా, తెలంగాణకు వచ్చిన పెరుగుదల తక్కువగా ఉంది.


రాష్ట్రంలో కొనసాగుతున్న రూ.47,984 కోట్ల రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కనీసం మరో పదేళ్లు పట్టే పరిస్థితి ఉంది. సికింద్రాబాద్, ఇతర స్టేషన్ల పునరావాసం, కొత్త లైన్‌లు, రెండో-మూడో లైన్ నిర్మాణాల కోసం నిధులు సరిపోవడం లేదు.

2016-17లో ప్రారంభమైన మనోహరాబాద్-కొత్తపల్లి(Manoharabad-Kothapalli) 151.36 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా ఇప్పటి వరకు సగం మాత్రమే పూర్తయింది. సాధారణంగా ప్రాజెక్టుల నిధుల వివరాలను ‘పింక్‌బుక్’లో విడుదల చేస్తారు, కానీ గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా తెలంగాణకు సంబంధించిన పింక్‌బుక్ అందుబాటులో లేదు. రైల్వే సీపీఆర్వో ప్రకారం, నిర్మాణ పురోగతిని బట్టి మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు.

ALSO READ:HCA New President | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కొత్త అధ్యక్షుడిగా ఎవరంటే! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *