Avesham 2 | ఫహద్ ఫాసిల్ ఆవేశం 2 పై సీక్వెల్ క్లారిటీ

Fahadh Faasil officially confirms "Avesham 2 Fahadh Faasil speaking at an event about the release of Avesham 2

మాలీవుడ్‌ యాక్షన్-కామెడీ డ్రామా “ఆవేశం (Avesham)”లో ఫహద్ ఫాసిల్‌ పోషించిన రంగ పాత్ర ప్రేక్షకులలో అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. ఈ క్రేజీ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుందన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఉత్సాహపరిచింది. ఫహద్ ఫాసిల్ ఇటీవల ఒక ఈవెంట్‌లో “ఆవేశం 2 (Avesham 2)” అధికారికంగా వస్తుందని ప్రకటించారు.

ఫహద్ ఫాసిల్‌ “తెలుగు, మళయాళీ, తమిళ్ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో”గా గుర్తింపు పొందాడు. ఆవేశం 2023లో సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.

రొమాంచం ఫేమ్ డైరెక్టర్ “జీతూ మాధవన్” దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ, ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్, రషీద్ యుక్తంగా నిర్మించారు.

ఫహద్ ఫాసిల్ తెలిపిన ప్రకారం, “ఆవేశం 2” సెట్స్‌పై 2027 లేదా 2028లో ప్రారంభం కానుందని చెప్పారు. ప్రస్తుతం డైరెక్టర్ జీతూ మాధవన్ తమిళ్ సినిమాలో సూర్యతో మొదటి ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నందున, ఫహద్ ఫాసిల్ తన ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత సీక్వెల్‌లోకి వెళ్తారు.

ప్రేక్షకులు, ఫాహద్ ఫాసిల్ అభిమానులు కోసం ఇది గుడ్ న్యూస్. మొదటి భాగంలోని కామిక్ టైమింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఆవేశం సీక్వెల్‌ మరింత అంచనాలు పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *