Allari Naresh Property Registration | నిడదవోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అల్లరి నరేష్‌ – ఆర్యన్ రాజేష్

Allari Naresh and Aryan Rajesh at Nidadavole sub registrar office Allari Naresh and Aryan Rajesh at Nidadavole sub registrar office

Allari Naresh Property Registration: సినీ యాక్టర్స్ అల్లరి నరేష్‌, ఆర్యన్ రాజేష్‌ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాని(Nidadavole sub-registrar office)కి వచ్చి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తికావడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను అధికారుల నుంచి స్వీకరించిన ఈ అన్నదమ్ములు సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ఎక్కువ సమయం పడే పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో పని పూర్తవడం కార్యాలయ సిబ్బంది సమర్థతకు నిదర్శనంగా పలువురు అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు భారీ రద్దీని ఎదుర్కొంటున్నాయి. భూముల కొత్త మార్కెట్ విలువలు త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో, పెంపు కంటే ముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు వస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు వేలకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 300 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగేవని, అయితే మార్కెట్ విలువలు పెరుగుతాయన్న అంచనాలతో గత నాలుగు రోజుల్లో లావాదేవీలు భారీగా పెరిగినట్లు వెల్లడించారు. దీంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరినట్లు సమాచారం.

ALSO READ:India GDP Growth | ప్రపంచ వృద్ధికి భారత్‌ ఇంజిన్‌ లాంటిది….ఎలాన్‌ మస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *