Akhanda 2 Release Twist: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ విడుదల వాయిదా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
విడుదలకు కొన్ని గంటల ముందు మద్రాస్ హైకోర్టు ఫైనాన్షియల్ వివాదాల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం విధించడంతో డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం నిలిచిపోయింది. ఇప్పటికే వాయిదాపై ఆగ్రహంతో ఉన్న అభిమానుల్లో కొత్తగా మరో చర్చ రేగింది.
వాళ్లు ముందే చెప్పారు మనమే అర్థం చేసుకోలేదు
బుక్ మై షోలో సినిమా పేజీలో “Releasing in 2026” అన్న డిస్‌ప్లే కనిపించడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ “ఇది తాత్కాలిక వాయిదా కాదు నేరుగా సంవత్సరమంతా మార్చేస్తారా?” అంటూ విమర్శలు పెరిగాయి.
మరికొందరు “బుక్ మై షో ముందే చెప్పింది–మనమే అర్థం చేసుకోలేదు” అంటూ వ్యంగ్య పూరిత పోస్టులు చేశారు.
ALSO READ:UPI Payments soon in Cambodia | భారత్–కంబోడియా మధ్య త్వరలో డిజిటల్ చెల్లింపులు
ఈ డిస్‌ప్లే ఉద్దేశపూర్వకమా లేదా సిస్టమ్ ఆటోమేటిక్ ప్లేస్‌హోల్డర్ తేదీనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం విడుదల తేదీ నిర్ధారించని సినిమాలకు సిస్టమ్ భవిష్యత్తులో ఊహాత్మక సంవత్సరాన్ని చూపించే అవకాశం ఉంది.
‘అఖండ 2’కు క్లియర్ రిలీజ్ డేట్ లేకపోవడంతో ఈ 2026 డిస్‌ప్లే అనుకోకుండా కనిపించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయినా బాలయ్య అభిమానులకు ఇది అస్సలు నచ్చలేదు. ఇప్పటికే వాయిదా వల్ల కలిగిన అసహనం మధ్య ఈ విజువల్ సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది.
