Varanasi OTT Deal | వారణాసికి భారీ ఆఫర్ ఇచ్చిన Netflix

Varanasi OTT Deal Varanasi OTT Deal

Varanasi OTT Deal: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’(Varanasi) విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Varanasi OTT Rights Creates Record:
ప్రముఖ ఓటీటీ దిగ్గజం “నెట్‌ఫ్లిక్స్”(Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం దాదాపు “₹650 కోట్ల భారీ ఆఫర్” ఇచ్చినట్లు సమాచారం. ఈ డీల్ ఫైనల్ అయితే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పెద్ద ఓటీటీ ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది.

ఈ ఒప్పందంలో భాగంగా థియేటర్లలో విడుదలైన తర్వాత వెంటనే ఓటీటీలోకి తీసుకురాకుండా ప్రత్యేక థియేట్రికల్ విండో ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలో విడుదల చేసే సినిమాలకు భిన్నంగా, ‘వారణాసి’ని కనీసం “8 వారాల తర్వాత” లేదా రెండు నుంచి మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా చర్చలు కొనసాగుతున్నాయి.

రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ నమ్మకం వ్యక్తమవుతోంది.

ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, విడుదలకు ముందే భారీ వ్యాపారం సాధించి ఇండస్ట్రీలో కొత్త రికార్డులకు దారి తీస్తోంది.

also read:India–Russia Oil Deal | ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *