వైసీపీ నుండి జనసేనలోకి 9 కార్పొరేటర్లు చేరిక

వైసీపీ నేత విక్రమ్ జనసేనలోకి 9 కార్పొరేటర్లతో చేరిక. 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరుగుతుంది. వైసీపీ నేత విక్రమ్ జనసేనలోకి 9 కార్పొరేటర్లతో చేరిక. 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరుగుతుంది.

విజయనగరం టౌన్ వైసీపీ నాయకులు పు విక్రమ్ తన భార్య భావనతో కలిసి జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

విక్రమ్ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెనకాల నడిచానని, వైసీపీకి మొదటిసారిగా విజయనగరంలో జండా ఎగరవేశానని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక తనకు, కార్యకర్తలకు ఏ విలువ కూడా ఇవ్వలేదని, వారికి సహకరించిన వాళ్లను వైసీపీ వారే దాడి చేయడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వంలో జనసేన విధానాలు నచ్చడంతో, కార్యకర్తలతో కలిసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఈ నెల 22న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 9 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నట్లు విక్రమ్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో, వైసీపీకి సేవలు చేసినా గుర్తింపు రాకపోవడం వల్ల పార్టీ మారాల్సి వచ్చినట్లు వివరించారు.

రాజకీయ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నాయకత్వం దేశంలో మార్పు తీసుకొస్తుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విక్రమ్ చెప్పారు.

ఈ మార్పు విజయనగరంలో జనసేనకు బలమైన సపోర్ట్ ఇస్తుందని, ప్రజల కోసం పని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని విక్రమ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *