రంపచోడవరం నియోజకవర్గం
చింతూరు మండలంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసి సాంప్రదాయం తోటి ఆదివాసి జీవన ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ తోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ఈ కార్యక్రమంలో ఆదివాసి కొమ్ముకోయ నృత్యాలు చేసుకుంటూ ప్రాజెక్ట్ అధికారి కావూరి చైతన్య కి చింతూరు ఏ ఎస్ పి రాహుల్ మీనా కి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. అలాగే చింతూరు ఐటిడిఏ కార్యాలయం నుండి చింతూరు ప్రధాన కూడలి వరకు అందరు అధికారులు,గిరిజన నాయుకులు బైక్ ర్యాలీగా వెళుతూ ప్రధాని కూడలి వద్ద ఉన్న గిరిజన సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించి ప్రధాన కూడలి వద్ద ఆదివాసి జండాలను ఆదివాసుల నాయకులు ఆవిష్కరించారు ఆదివాసుల విధివిధానాలను సాంప్రదాయాలను సాంస్కృతిని అందరూ అనుసరించాలని ఆదివాసులందరూ ఐక్యంగా ఉండాలని ఆదివాసులందరూ ఒకటే అని నినాదాలు చేస్తూ తిరిగి చింతూరు గురుకుల పాఠశాల ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ప్రాంగణంలో ఆదివాసులచే స్వయంగా తయారు చేయబడిన అడవి జంతువుల బొమ్మలు ఆదివాసుల వంటకాలను వారి సంస్కృతికి సంబంధించిన చిత్రపటాలను చింతూరు ఐటిడిఏ పిఓ చింతూరు ఏఎస్పీ సందర్శించారు